calender_icon.png 26 November, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి శైలజ కుటుంబాన్ని ఆదుకోవాలి

26-11-2024 04:41:51 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కొమరం భీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బం రాఘవేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో వసతుల లేమి కారణంగా 886 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారని ఆరోపించారు. గత నెలలో 60 మంది విద్యార్థులు వుడ్ పాయిజన్ కు గురయ్యారని, ఇందులో కొందరిని మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించాలని, తీవ్ర అస్వస్థతకు గురైన శైలజ నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిందని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబానికి రూ కోటి రూపాయల ఎక్స్గ్రేషియాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను బేషరతుగా ప్రభుత్వం విడుదల చేయాలని, లేనట్లయితే పార్టీ ప్రజా సంఘాల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.