06-04-2025 04:24:12 PM
ఘనంగా సిఐటియు వ్యవస్థాపకులు బిటి రణదీవే వర్ధంతి వేడుకలు..
మందమర్రి (విజయక్రాంతి): సిఐటియు వ్యవస్థాపకులు బిటి రణదీవే స్ఫూర్తిగా సింగరేణిలో ఐక్య పోరాటాలు ఉదృతం చేసి కార్మిక హక్కుల సాధన కోసం వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజీలేని ఉద్యమాలు నిర్మిస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి ఆల్లి రాజేందర్ లు స్పష్టం చేశారు. రామకృష్ణాపూర్ లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం బిటి రణదీవే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలను ఏకతాటి పైకి తీసుకువచ్చి ఐక్య పోరాటాలకు నెలవుగా ఉండాలనే ఉద్దేశంతో సిఐటియును స్థాపించడం జరిగిందని వారు స్పష్టం చేశారు. బిటి రణదీవే స్ఫూర్తితో మే 20న జరిగే జాతీయ సమ్మెను అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఐక్యంగా విజయవంతం చేస్తామన్నారు. రణదీవే ఉన్నత స్థాయి విద్యనభ్యసించినప్పటికి తన తండ్రి కోరిక మేరకు ఉద్యోగం చేయకుండా కార్మిక వర్గం ప్రయోజనాల పరిరక్షణకు, వారికివ్ జరుగుతున్న అన్యాయం ను గమనించి కార్మిక వర్గ యూనియన్ లో చేరి క్రియాశీలకంగా పని చేశారనీ వారు గుర్తు చేశారు. అంతే కాకుండా ఒక పత్రికను స్థాపించి కార్మిక వర్గంను సమస్యల పట్ల ఆలోచింపచేయడంలో పత్రికను బహుళ ప్రాచుర్యం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని వారు ఆన్నారు.
స్వాతంత్ర సంగ్రామములో పాల్గొని అనేకమార్లు జైలు నిర్బందా లను చవి చూశారని, ఆయన తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు సైతం వెళ్లకుండా జైల్లోనే నిర్బంధించారని వారు ఆన్నారు. అనేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని అన్ని కార్మిక సంఘాలను ఉమ్మడిగా తీసుకురావడంలో అప్పుడున్న యూనియన్లు విఫలమవుతున్నాయని గమనించి 5000 మంది ప్రతినిధులతో మహాసభను ఏర్పాటు చేసి సిఐటియును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిఐటియు స్థాపన అనంతరం జరిగిన మొదటి జాతీయ సమ్మెను ముందుండి విజయవంతం చేయడంలో ఆయన చేసిన కృషిని మరువలేమన్నారు. అనంతరం ఆయన ఆశయాల ప్రకారమే ప్రతి పోరాటంలోను అన్ని కార్మిక సంఘాలను ఉమ్మడిగా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్య పోరాటాలను నిర్వహించడంలో నేడు సీఐటియు క్రియాశీలకంగా పనిచేస్తుందని, భవిష్యత్తులోనూ ఆయన ఆశయాలను నెరవేర్చే విధంగా కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో ముందుండి పోరాడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, సిహెచ్పీ పిట్ సెక్రటరీ అయిందాల శ్రీనివాస్, కేకే -5 సెక్రటరీ సంకె వెంకటేష్, వర్క్ షాప్ పిట్ సెక్రటరీ భరత్, సివిల్ ఫిట్ సెక్రటరీ అంగడి రాజ్ కుమార్, కాసిపేట 2 పిట్ సెక్రటరీ బుద్దే సురేష్, శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్ పిట్ సెక్రటరీ పసుపునూటి శ్రీకాంత్, కెకె డిస్పెన్సరీ పిట్ సెక్రటరీ పంగ మల్లేష్, శ్రీకాంత్, కాసిపేట్ 1 అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నాగవెల్లి శ్రీధర్, సీనియర్ నాయకులు అలవాల సంజీవ్ లతోపాటు ఆర్గనైజర్లు ఆదర్శ్, ధరిశెట్టి సురేష్, లింగాల రమెష్, కలవల శ్రీనివాస్, రాజ్ కుమార్, మనోజ్, అరుణ్, రాంబాబు, తాజుద్దీన్, అల్వాల అభిలాష్ లు పాల్గొన్నారు.