calender_icon.png 19 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌చట్టం రద్దయ్యేవరకు పోరాటం ఆగదు

18-04-2025 12:56:09 AM

  1. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాల రాస్తున్న వక్ఫ్ చట్టం

మూడు నెలల శాంతి యుత పోరాటాలకు పిలుపు

సిద్దిపేట, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు ముస్లింల పోరాటం ఆగదని సిద్దిపేట ముస్లిం జె ఏ సి సభ్యులు అబ్దుల్ సమి, ముఫ్టీ కరీముద్దీన్ పటేల్ తెలిపారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  ముస్లింల ఆస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు వెంటనే రద్దు చేయాలన్నారు.

ఈ చట్టం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాల రాస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన నుండి మైనారిటీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాన్నారు. భారత దేశంలో 25%  ఉన్న మైనారిటీల హక్కులను కాల రాయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టం రద్దు చేయాలన్నారు.

ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచన మేరకు  శాంతి యూత నిరసనలు తెలుపడానికి సిద్దిపేట ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో 12  సామాజిక, ఉలేమాల సంస్థలు, బిఆర్‌ఎస్, కాంగ్రెస్, మిగతా రాజకీయ పార్టీ నాయకులతో కలిపి ముస్లిం జె ఏ సి ఏర్పాటు చేశామని అబ్దుల్ సమి తెలిపారు.

రాబోయే మూడు నెలల పాటు ప్రతి శుక్రవారం మస్జీద్ ల వద్ద శాంతి యూత నిరసనలు తెలుపుతామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట తంజీమ్ సుప్రీం బాడీ అధ్యక్షులు జుబెర్ హుస్సేన్, జమయితే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఖుద్ధుస్, కౌన్సిలర్లు అబ్దుల్ మొయిజ్, అర్షద్, గౌస్ మోహినొద్దీన్, ఫకృద్దీన్, పాల్గొన్నారు.