calender_icon.png 20 April, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగుల రాజ్యాధికారం కోసం పోరు

16-04-2025 12:00:00 AM

‘మా భూమి రథయాత్ర’ ప్రారంభోత్సవంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ 

ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాధికారమే లక్ష్యంగా లక్ష కిలో మీటర్ల ‘మా భూమి రథయాత్ర’ను ప్రారంభించడం జరుగుతుందని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. రెడ్డి, రావ్‌లు నిర్వహించే సభలకు బడుగు బలహీ న వర్గాలు వెళ్తారు కానీ, అదే బడుగు బలహీన వర్గాలు నిర్వహించే సభలకు రెడ్డిలు, రావులు ఎందుకు రారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లోని మల్టీపర్పస్ గ్రౌండ్ లో సోమవారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.

ముందుగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ తో పాటు బడుగు బలహీన వర్గాల మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా  విశారదన్ మాట్లాడుతూ ఎంతో మంది బడుగుల ప్రాణాలు అర్పిస్తే వచ్చిన తెలంగాణను తీసుకెళ్లి రెడ్డి, రావులకు అప్పగించారని ధ్వజమె త్తారు. బలహీన వర్గాల రాజ్యాధికారంను తీసుకురావడమే అంబేద్కర్‌కు  నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు.   ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, ప్రొఫెసర్లు రామయ్య యాదవ్, కుమారస్వామి, చంద్ర య్య, బీసీ సంఘాల నేతలు, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.