calender_icon.png 13 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమికోసం, భుక్తికోసం సాగిన పోరాటం

17-09-2024 12:00:00 AM

హైదరాబాద్ రాజ్యం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. నిజాం ఆకృత్యాలకు వ్యతిరే కంగా తెలంగాణ గడ్డమీద జరిగిన సాయు ధ రైతాంగ పోరాటం పీడిత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిబింబం. పోరాటం ప్రజల ది, త్యాగాలు ప్రజలవి,చరిత్ర ప్రజలది. కొ న్ని శక్తులు తమదే చరిత్ర అన్నట్లుగా వక్రీకరిస్తున్నారు. వక్రీకరణకు గురవుతున్న సెప్టెంబర్ 17 చరిత్రను వెలికి తీయాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజంపై ఉం ది. ‘తెలంగాణ సాయుధ రైతాంగ  పోరా టం’ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది.

నిజాం పాలన కింద 224 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రజ లు కఠోరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రజలు సామాజిక పీడనలను అ నుభవిస్తూ దుర్భరమైన జీవితాలను కొనసాగించారు. తెలంగాణలో ఉన్న భూస్వా ములు, దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండే లు జమీందారులు,జాగీర్దారులు నిజాం అనుయాయులుగా కొనసాగుతూ  పీడిత ప్రజ లపై దాష్టీకాలు కొనసాగించారు. తెలంగాణ భూస్వాముల ఆర్థిక దోపిడికి అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. సామాజిక వివక్షతలను నిరంతరాయంగా కొనసాగించారు. అనేక వృత్తుల వారు శారీరక, సామాజిక పీడనలను అనుభవించారు.

‘ఆంధ్ర మహాసభ’ ఆధ్వర్యంలో పోరాటం

నైజాం పాలనలో 1920-22,1930-33 సంవత్సరాల్లో తీవ్రమైన కరువు కాట కాల సంక్షోభం తెలంగాణలో ఏర్పడింది. పన్నులు కట్టలేని రైతుల భూములను బలవంతంగా జమీందారులు తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు. ఇలా సామాన్య రైతు ల నుండి సూర్యాపేట జిల్లాలో ఎర్రబాడు జమీందారు లక్షా యాభై వేల ఎకరాలు, మరొక జమీందారు విసునూరు రామచంద్రారెడ్డి నలభై వేల ఎకరాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. 1929 నాటికి ఆహార సంక్షోభం ప్రపంచ వ్యా ప్తంగా చుట్టిముట్టింది. అప్పటికే తెలంగాణలోవాణిజ్య పంటలకు ప్రత్యేకత ప్రాధాన్యత ఏర్పడి ఉంది.

ఇందులో భాగంగానే వేరుశనగ, ఆముదం అత్యధిక విస్తీర్ణంలో సాగయింది. ఆము దం ఎగుమతి బాగా పెరిగింది.ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కాని ‘ఆహార సంక్షో భం’ మూలంగా అనతికాలంలోనే వాణి జ్య పంటలపై తీవ్ర ప్రభా వం చూపి అంతర్జాతీయ మార్కెట్‌లో డి మాండ్ తగ్గింది. ప్రజల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రజలు తీవ్రమైన నష్టాల్లో ఇరుక్కుపోయారు.కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి శిస్తు అధికం చేశారు.

అధికమైన శిస్తుభారంతో రైతాంగ కుటుంబాలు చితికి పోయాయి. అధిక భారాన్ని భరించలేని రైతులు, వ్యవసాయ కూలీలు ఆకలి మంటలతో, మాడిన కడుపులతో భూస్వాములకు వ్యతిరేకంగా భూ మి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించారు.

1944 నాటికి తెలంగాణలోని గ్రామా లు ‘సంఘం’,ఆంధ్ర మహాసభ అధ్వర్యంలో అనేక రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అప్పటికే నిజాం నిరంకుశ పాలనలో భాగస్వాములైన హిందూ భూస్వాములు లక్షల ఎకరాలకు అధిపతులయ్యారు. గడీల పాలన తీవ్ర రూపం దాల్చింది. మెజారిటీ ప్రజలు భూస్వాముల ఆగడాలకు ఆగమైనవారే. కాని ఎప్పటికప్పుడు ‘సంఘం’ అధ్వర్యంలో పీడిత ప్రజలకు భరోసానిచ్చేవా రు. ఆంధ్రమహాసభలు ప్రజలను నిరంతరం జాగరూకులను చేసేవి.

నిజాం పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండేవి కావు. సంఘం రహస్యంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతం  చేసేది.1946 నాటికి దేశ్‌ముఖ్ లకు వ్యతిరేకంగా సాగిన నిరసన యాత్రలో పోలీస్ పటేల్ మష్కిన్ అలీ కాల్పుల్లో ‘దొడ్డి కొమురయ్య’ మరణించారు. కొమురయ్య అమరత్వ స్ఫూర్తితో ఈ దొరలను,భూస్వాములను,నిజాంను ఎదుర్కొనడానికి పీడిత ప్రజలు సాయుధ పోరు ప్రారంభించారు.

సాయుధ పోరులో నిజాం నిరంకుశత్వా న్ని, జమీందారుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ తెలంగాణ కళాలు, గళాలు నిత్య నిరసనను కొనసాగించాయి. ఒక వైపు దేశ విభ జన, మరొక వైపు తెలంగాణలో నిజాం అనుయాయులు,దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కొన సాగుతుంది. ఈ నేపథ్యంలో నే 1946 సెప్టెంబర్ 11 న సంఘం అధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. 

ఆపరేషన్ పోలో

ఈ క్రమంలో హైదరాబాద్ రాజ్యంపై పటేల్ ఒక నిర్ణయానికి వచ్చారు. చైనా దేశ పు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దే శంలో కమ్యూనిస్టులను అణచివేయాలనుకున్నారు. పైకిమాత్రం నిజాం, ఖాసి రజ్వీలపై దాడి ప్రారంభించారు.అప్పటికే నిజాం తన ‘ప్రధానుల’ ద్వారా భారత ప్రభుత్వ ఆలోచనలను భద్రతామండలికి ఫిర్యాదు చేశారు.నిజాం చెపితే వినే వ్యక్తి జిన్నా. కాని అకస్మాత్తుగా జిన్నా మరణం నిజాం వెన్ను విరిచింది. ద్రతా మండలిలో చర్చ వచ్చేలోగా భారత యూనియన్ సైన్యాలు 1948 సెప్టెంబర్ 13 న హైదరాబాద్ రాజ్యాన్ని మూడువైపుల నుండి చుట్టు ముట్టాయి.

అప్పటికే రజ్వీ సైన్యాలు గ్రామాలపై పడి స్త్రీలను వివస్త్రలను చేసి వారిని బలవంతగా లోబర్చుకుంటున్నా యి. ఆ సందర్భంలో నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాన్ని ఖండిస్తూ తెలంగాణలో అనేక రకాల సాహిత్యం, కవిత్వాలు ప్రజలను చైతన్యవంతం చేశాయి. దాదాపుగా ఐదు రోజుల పాటు కొనసాగిన భారత ప్రభుత్వసైనిక దాడిలో (ఆపరేషన్ పోలో )1948 సెప్టెంబర్ 17 న నిజాం లొంగుబాటును భారత ప్రభుత్వం ప్రకటించింది.

నిజాం లొంగుబాటు, రజ్వీ ఆగడాలు అరికట్టడమే భారత ప్రభుత్వ అంతిమ లక్ష్యం అయితే 1951వరకు  ప్ర భుత్వ సైన్యాలు ఎవరి మీద దాడి కొనసాగించినట్లు...? ఇంతటి మహత్తరమైన పో రాటంలో జరిగిన పరిణామాల గూర్చి నె హ్రూ స్నేహితుడైన పండిట్ సుందర్ లాల్ ‘గుడ్‌విల్ మిషన్’ పేరుతో తెలంగాణ పల్లె ల్లో తిరిగి అందరిని అడిగి తెలుసుకున్న వివరాల ఆధారంగా అధికారికంగా  27,000 నుండి 40000 మందికి పైగా,అనధికారికంగా 2,00,000 పైగా తాడిత, పీడిత ప్రజలు మరణించారని తన నివేదిక లో చెప్పారు. 

సమాధానం లేని ప్రశ్నలు

సంఘ్ పరివార్ శక్తులు వాదిస్తున్నట్లు విమోచనమైతే ఈ గడ్డపై ఇన్ని త్యాగాలు ఎందుకు జరిగినటు? ఇప్పుడు కొన్ని  రాజకీయ పార్టీలు విమోచనమని, విలీనమని చరిత్రను వక్రీకరించే విధంగా అర్థరహితమైన వాదనలు చేస్తున్నాయి. ఏనాడూ తె లంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానరాని ఆరెస్సెస్, బీజేపీలు(ఆర్యసమాజ్ తప్ప) హైదరాబాద్ విషయంలో ఉన్న ఉ రుకులాట కాశ్మీర్ విషయంలో ఎందుకు లేదు..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. నిజాం లొంగుబాటు త ర్వాత 1948 సెప్టెంబర్ 18  నుండి 1950 జనవరి 25 వరకు రాజుగా నిజాం పేరు మీద హైదరాబాద్ పాలన కొనసాగింది. రాజ్ ప్రముఖ్ గా హోదాను ( 1950-1956 ) అనుభవించారు.

ఖాసీం రజ్వీని ఏడు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత సాదరంగా తాను కోరుకున్న చోటికి భారత ప్ర భుత్వం పంపించింది. అలాగే రజ్వి సై న్యంపై చర్యలు తీసుకున్న దాఖలాలు లే వు. నిజాం, ఖాసిం రజ్వీ సైన్యం దాడిలో మరణించిన వారికంటే  కమ్యూనిస్టుల ఏ రివేత పేరుతో భారత యూనియన్ సైన్యం చేతిలో ఎక్కువగా ప్రజలు మరణించారనేది చరిత్ర చెపుతున్న సత్యం .ఇదే తరహా లో జె.ఎన్ చౌదరి, వెల్లోడిల కాలంలో తీ వ్ర మారణహోమం జరిగింది. తెలంగాణ కు విమోచనమే జరిగితే తెలంగాణ సా యుధ పోరాటంలో లక్షలాదిమంది త్యా గాలు ఎందుకు జరిగినట్లు?నిజంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమై తే హైదరాబాద్ రాజ్య ప్రజలకు- భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏ మైనా ఉందా! ప్రజలు విలీనం చేసుకోమ ని ఆహ్వానించారా..!  ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సిన అవసరం ఉంది.

 వ్యాసకర్త సెల్: 9441661192