calender_icon.png 12 March, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం

12-03-2025 01:40:20 AM

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీపై సమీక్ష సమావేశం..

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ను సన్మానించిన నీలం మధు

సంగారెడ్డి, మార్చి 11 (విజయ క్రాంతి): కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం అని గ్రామస్థాయిలో నాయకులను తయారు చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉండని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారని, మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి నీళ్ల మధు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రుల ను కలిసి పని సమస్యలపై చర్చించారు. గ్రామ స్థాయిలో నాయకులను తయారు చేసేందుకు వాటి కృషి చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొందినందుకు ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశం చేశారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకపోవాలని కోరారని చెప్పారు. ప్రతి వాడను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. పెండింగ్ పనుల వివరాలు తీసుకొని రండి, పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమాజంలో రాష్ట్ర మంత్రులు  దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీకి బలం అని ప్రతి నాయకుడు కార్యకర్తలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ కొండా సురేఖ, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.  హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర రావు, మైనంపల్లి హనుమంతరావు తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.