calender_icon.png 27 October, 2024 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులందున ఈ ‘అనధికారుల’ కథే వేరు!

06-08-2024 01:10:46 AM

ఆఫీసులో ‘ఆ ఐదుగురు’దే హవా

అనధికారిక పోస్టులు అనుభవిస్తూ తిష్ఠ

ఓ ఉన్నతాధికారి అండదండలతో చేతివాటం

వివాదాలకు కేరాఫ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయం

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): అది హైదరాబాద్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కార్యాల యం. అక్కడ దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. కానీ ‘ఆ ఐదుగురు’ సంగతే వేరు. వారి రూటే సప‘రేటు’. కార్యాలయం నుంచి ఏ ఫైల్ కదలాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారి చెప్పిందే చెల్లుబాటు.

కార్యాలయంలో వారు అంత ప్రభావం చూపిస్తున్నారంటే వారేదో అక్కడి ఉద్యోగులా..? అంటే అదీ కాదు. కమిషనర్ కార్యాలయంలో వారు అనధికారికంగా పనిచేస్తుండడం గమనార్హం. వారు జీఎస్టీ విభాగానికి చెందిన అధికారులే.. కానీ వారి పోస్టింగ్స్ మాత్రం అక్కడ కాదు. ఓ ఉన్నతాధికారి సూచనలతోనే వారికి అనధికారిక పోస్టింగ్స్ వచ్చాయని ఉద్యోగుల వర్గాలు చర్చించుకుంటున్నారు.

సద రు ఉన్నతాధికారిని ఎవరు కలవాలన్నా.. ముందుగా ఆ ఐదుగురిని ప్రసన్నం చేసుకోవాలని, వారు కోరింది సమర్పించాలనే చర్చ బాహాటంగా నడుస్తున్నది.  వీరి అత్యుత్సాహం వల్లే కమిషనర్ కార్యాలయం మూడు వివాదాలు.. ఆరు స్కాంల’తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.

ఆ ఐదుగురికి నిజామా బాద్, నల్గొండ జిల్లాలో పోస్టింగ్స్ రాగా, వారు అక్కడకి వెళ్లడం లేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. ఆ ఐదుగురికి కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించే అవకాశమే లేదు. కానీ వారికి కార్యాలయంలో ప్రత్యేకంగా క్యాబిన్లు సైతం ఉండడం గమనార్హం.

రిజ్వీ రాకతో సెట్‌రైట్..

కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీకి రాష్ట్రప్రభుత్వం తాజాగా కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సోమవా రం హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించగా.. ‘ఆ ఐదుగురు’ తమ అసలు స్థానాలకు వెళ్లిపోవడం, శనివారం వరకు ఆఫీసుకు వచ్చి, సమీక్షకు డుమ్మా కొట్టడం గమనార్హం. రిజ్వీ రాక తో ఇక అంతా సెట్‌రైట్ అయినట్లు, ఆయన ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే అటెండర్లు, పీఏలను వారి సొంత స్థానాల్లోకి పంపించినట్లు సమాచారం.

అధికారి అండగా చేతివాటం..

ఓ ఉన్నతాధికారి అండదండలతో ఆ ఐదుగురు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆయన ఆదేశాలతోనే కమిషనర్ కార్యాలయంలో అటెండర్లు, పీఏలకు ఇష్టానుసారంగా విధులు కేటాయించినట్లు తెలిసింది. ఏకంగా తన చాంబర్‌లో పనిచేస్తున్న అందరు సిబ్బందిని మార్చేశాడనే ఆఫీస్ వర్గాలు చర్చించుకుంటున్నా యి.

ఆయన అండగా ఉన్నారనే ధీమాతో ఆ ఐదురుగు అధికారులు జీఎస్టీ వసూళ్లలోనూ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. జీఎస్టీ వెబ్‌సైట్ పోర్టల్ డీల్‌లోనూ వీరే కీలక పాత్ర పోషించి నట్లు సమాచారం . సదరు ఉన్నతాధికారి ఆదేశాలతోనే అప్పటి వరకు ఉన్న సాఫ్ట్‌వేర్‌ను పక్కనపెట్టి, రూ.10కోట్లు వెచ్చించి ఒక కంపెనీకి పోర్టల్ తయా రు చేసే పని అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.