calender_icon.png 29 March, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల కథ

23-03-2025 12:42:59 AM

హైదరాబాద్‌లో నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన చిత్రం ‘మా భూమి’. ఈ చిత్రం 23 మార్చి 1980లో విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా ౪౫ ఏండ్లు! జీ రవీంద్రనాథ్, బీ నర్సింగరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిచంద్, కాకరాల, బీఎన్ రావు, రామిరెడ్డి, భూపాలరెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. కిషన్ చందర్ రచించిన హిందీ నవల ‘జబ్ ఖేత్ జాగే’ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అంతర్జాతీయ చలనచిత్రో త్సవం తొలిసారిగా ప్రదర్శించబడింది.

ఈ సినిమా కథేంటంటే.. నల్లగొండ జిల్లాలోని సిరిపురం అనే గ్రామంలో నివసిస్తున్న బీద రైతు కూలీలలో వీరయ్య కొడుకు రామయ్య ఒకడు. పదో ఏటనే భూస్వామి వద్ద పశువులు మేపడానికి కుదురుతాడు. జగన్నాథరెడ్డి భూస్వామి. అతని కొడుకు ప్రతాపరెడ్డి. వీరికి 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. దీంతో వీరి దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుంది. వీరిని ఎదుర్కొనేందుకు ‘సంఘం’ మద్దతు కోరాలని నాగయ్య అనే పశువుల కాపరి అందరికీ సూచిస్తాడు.

కొన్ని పరిస్థితుల కారణంగా రామయ్య గ్రామం విడిచి పట్టణానికి పోయి.. ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ చదవడం, రాయడం నేర్చుకుంటాడు. ఫ్యాక్టరీలో సమ్మె కారణంగా రామయ్య అరెస్టు జైలుకు వెళతాడు. అక్కడ నాగయ్య కనిపించి గ్రామ పరిస్థితులు వివరిస్తాడు. ఆ తరువాత కథ ఆసక్తికర మలుపు తీసుకుంటుంది.