08-02-2025 01:35:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మెట్టుగూడలో గురువారం తల్లీకొడుకులు రేణుక, యశ్వంత్‌లపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసినట్టుగా భావించారు. ఇదంతా కట్టు కథేనని పోలీసులు నిర్ధారించారు. మెట్టుగూడకు చెందిన రేణుక ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తున్నది.
గురువారం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేశారని పోలీసులకు యశ్వంత్ సోదరులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా.. పెద్ద కుమారుడు యశ్వంత్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కత్తితో పొడుచుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడగా..
అడ్డు వచ్చిన తల్లిని కూడా పొడిచినట్టుగా వెలుగులోకి వచ్చింది. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్ కోలుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.