- బాలికను తల్లి దగ్గరికి చేర్చిన పోలీసులు
వారం రోజుల్లోనే బాలిక కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, జనవరి 10 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా కలకలం లోపిన బాలిక కి డ్నాప్ కేసు కథ సుఖాంతమైంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా నూతన సాంకేతిక పరి జ్ఞానంతో వారం రోజుల్లోనే కిడ్నాప్‌ను చే దించి, బాలికను తల్లి దగ్గరికి చేర్చారు. శుక్ర వారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో కిడ్నాప్ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య అనే దంపతులు ఇద్దరు కుతురులు ఉండగా,లాస్యకు మతిస్థి మితం కారణంతో భర్తతో వ్యక్తిగత కారణా లవల్ల గత కొద్దిరోజులుగా దూరంగా ఉం టుందన్నారు. లాస్య తన కూతురు సింగా రపు అద్విత (4) రాజన్న దర్శనానికి వేముల వాడ వచ్చి ఇక్కడే ఉండగా మహబూబాద్ కి చెందిన ముగ్గురు మహిళలలు వేముల వాడ రాజేశ్వర స్వామి దేవస్థానానికి రాగా లస్యతో చనువు ఏర్పడిందన్నారు.
అందరు కలిసి దాదాపు 5 రోజులుగా వేములవాడ గుడి ఆవరణలో నిద్ర, మొక్కులు తీర్చుకు న్నారని, ఈక్రమంలో పాప తల్లి మతిస్థిమి తం కారణంతో పాపను సరిగా చుడుకో వడం లేదని గ్రహించిన ముగ్గురు అనుమా నిత మహిళలు పాపని దగ్గరకి తీసుకొని పరిచయం పెంచుకొని నమ్మించారని తెలి పారు. పాప తల్లి సరిగా పట్టించుకోవట్లేదని గ్రహించిన ఆముగ్గురు మహిళలు డిసెంబర్ 23న వారితో పాటే పాపను తీసుకెళ్లారు.
ఇట్టి సంఘటనపై పాప మేన మామ పల మారు గంగస్వామి వేములవాడ పోలీసుల కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి మతిస్థిమితం లేని కారణంగా ఎలాంటి విషయలు చెప్పక పోవడంతో ఎలాంటీ ఆధారాలు లేనప్పటికీ జిల్లా పోలీస్ యంత్రాంగం ఛాలెంజింగ్ గా తీసుకొని 7 స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింద న్నారు.
రాజరాజేశ్వర దేవస్థానం, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లు, హైదరాబాద్, కరీంనగర్, వరం గల్, ఖమ్మం, విజయవాడ, కోదాడ పరిసర ప్రాంతాలలో గల సిసి కెమెరాలు పరిశీలిం చి, ఆధునిక సాంకేతికను ఉపయోగించి నిందితులు మహబూబాబాద్ జిల్లా ఒక గ్రామంలో ఉన్నట్లు తెలుసుకొని ఆ గ్రామ ఉప సర్పం సహాయంతో నిందుతులైనా శ్రీరామోజీ వెంకట నరసమ్మ,గంభీరపు అంజవ్వ,కునపురి ఉప్పమ్మ ల వద్ద నుండి పాపాను కాపాడి (బాల రక్షక భవన్) చైర్మన్ అంజయ్య అప్పజెప్పడం జరిగిందన్నారు.
తదుపరి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరి గుందని, ముగ్గురు మహిళలను రిమాండ్ కి తరలించా మని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఏడు రోజులకే బాలిక కిడ్నాప్ చేదించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,వేములవాడ టౌన్ సి.ఐ వీరప్రసాద్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, ఎస్‌ఐ లు సుధాకర్, రమేష్ ,జునైద్ మరియు సిబ్బంది తిరుపతి,రాజేష్, అక్షర్, శ్రీనివాస్, మహిపాల్, ఇమ్రాన్, గోపాల్,బాబాయ్ లను అభినందించి ప్రశంశ పత్రాలు అందిం చడం జరిగిందన్నారు. ఈసమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ లు వీరప్రసాద్ ,సదన్ కుమార్, ఎస్.ఐ లు సుధాకర్, రమేష్, జునైద్, సిబ్బంది పాల్గొన్నారు.