calender_icon.png 6 March, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపు మండిన కాకుల కథ

04-03-2025 12:00:00 AM

నాని, శ్రీకాంత్ ఓదెల.. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో నాని ఊరమాస్ గెటప్‌లో కనిపించ నున్నారు. ఇందుకు సంబంధించి గ్లింప్స్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఒక పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ కథ ముఖ్యాంశాన్ని అందిస్తుంది. ‘చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు.

ఇది కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తంబోసి పెంచిన ఓ జాతి కథ’ అంటూ సాగే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. నాని మేకోవర్ అద్భుతంగా ఉంది. రా స్టేట్‌మెంట్ ద్వారా అనౌన్స్ చేసినట్లుగా ఈ సినిమా 2026, మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది.