calender_icon.png 27 January, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తలకు బుద్ధి చెప్పిన అన్నదమ్ముల కథ

25-01-2025 12:00:00 AM

‘నిలువు దోపిడీ’ చిత్రం 25 జనవరి 1968లో విడుదలైంది. మంజుల సినీ సిండికేట్ బ్యానర్‌పై యూ విశ్వేశ్వరరావు నిర్మించారు. సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, దేవిక, కృష్ణ, జయలలిత ముఖ్య తారాగణం. కథేంటంటే.. రంగవరం జమీందారు చనిపోతూ తన కుమారు లైన రాము, కృష్ణలను తన తోబుట్టువులైన చుక్కమ్మ, శేషమ్మలకు అప్పజెప్తాడు.

చుక్కమ్మకు జమీందారి ఆస్తిపై కన్నుపడి శేషమ్మతో కలిసి కుట్రపన్ని తమ్ముడు నాగభూషణం సాయంతో మేనల్లుళ్లను హతమార్చాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే రైల్లో హంతకుడి చేతిలో పడిన పిల్లలను ఒక ముసుగు మనిషి రక్షించి గురుకులంలో చేరుస్తాడు.

అక్కడే పెద్దవారైన అన్నదమ్ములు తమ గురువు ద్వారా తమ కథ తెలుసుకుని రంగవరానికి తిరిగి వస్తారు. ఈలోపే చుక్కమ్మ కూతురు రాధను కృష్ణ, శేషమ్మ కూతురు జానకిని రాము ప్రేమిస్తారు. ఇక రంగవరానికి వచ్చిన రాము, కృష్ణ ఏం చేస్తారు? తమ అత్తలు చుక్కమ్మ, శేషమ్మలకు ఎలా బుద్ధి చెబుతారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.