calender_icon.png 25 October, 2024 | 12:57 PM

వాస్తవ ఘటనే ది బర్త్ డే బాయ్ కథ

19-07-2024 03:45:00 AM

రవికృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’. విస్కీ దర్శకత్వంలో బొమ్మా బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేశారు. దర్శకుడు విస్కీ మాట్లాడుతూ.. “ఓ రియల్ ఇన్సిడెంట్‌ను సినిమాగా తీద్దామని 2020 లో అనుకున్నా. అందుకే యూఎస్‌లో నాలుగేళ్లు జాబ్ చేస్తూ మనీ సేవ్ చేసుకున్నా. దీంట్లో 80 శాతం కథ వాస్తవ ఘటనకు సంబంధించిన సన్నివేశాలే.

నేను సినీ పరిశ్రమలోకి వెళ్లటం నా ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టంలేదు. అందుకే కొవిడ్ టైంలో చనిపోయిన నా కుక్కపిల్ల పేరు విస్కీ. అదే పేరు నేను పెట్టుకొని, ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకొని తిరుగుతున్నా. వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే సినిమాలు తీయడం ఆపేస్తా” అన్నారు. ‘తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి నాకు చెప్పి సినిమా తీద్దామన్నాడు డైరెక్టర్. అతను ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పే విధానం చూస్తున్నప్పుడే అనుకున్నా ప్రొడ్యూస్ చేయాలని. అతను చెప్పినట్టే తెరకెక్కించాడు’ అని ప్రొడ్యూసర్ భరత్ చెప్పారు.