తల్లి, భార్యల మధ్య నలిగిన ఓ వ్యక్తి కథే ‘తల్లా? పెళ్లామా?’. ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1970 జనవరి 8న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు, చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎన్ త్రివిక్రమరావు నిర్మించారు. రమణమ్మ.. ఆమె ఇద్దరు కుమారులు ప్రభాకర్, సుధాకర్ ఓ గ్రామంలో నివసి స్తూ ఉంటారు.
పెళ్లయిన వెంటనే ప్రభాకర్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ వెంటనే కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. రమణమ్మ సుధాకర్‌ను విద్యావంతుడిగా తీర్చిదిద్దేందుకు చాలా కష్టపడుతుంది. సుధాకర్ కళాశాలలో చేరి.. రావు బహదూర్ రాజకీయ కుయుక్తులను ఎదుర్కొంటాడు. అతని కూతురు పద్మ.. సుధాకర్ ఆశయాలను ఇష్టపడి అతడిని ప్రేమించి తండ్రి అంగీకారం లేకుండా పెళ్లాడుతుంది. అయితే తల్లికి భర్త ఇచ్చే ప్రాధాన్య తను సహించలేని పద్మ ఏం చేసింది? ఆ తరువాత వారి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు.