యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను చేసి న క్యారెక్టర్ సిద్ధు. సిద్ధార్థ్ తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనూ వెనుకడుగు వేయడు. జీవితాంతం కట్టుబడి ఉంటాడు. క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ మా ‘దిల్ రూబా’ నచ్చుతుంది” అన్నారు.
‘మనందరి జీవితాల్లోని ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశా’ అని డైరెక్టర్ విశ్వకరుణ్ తెలిపారు. ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ.. ‘కథ చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. చేస్తే ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేయాలనునుకున్నాం’ అని చెప్పారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ డా నియేల్ విశ్వాస్, ఎడిటర్ కేఎల్ ప్రవీణ్, ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, కొరియోగ్రాఫర్లు ఈశ్వర్, జిత్తు, కో ప్రొడ్యూసర్ సురేశ్‌రెడ్డి, చిత్రబృందం పాల్గొన్నారు.