calender_icon.png 30 April, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేయసి కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒంటరి యువకుడి కథ

29-04-2025 12:00:00 AM

సౌమిత్‌రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం ‘నిలవే’. ఈ చిత్రానికి సౌమిత్‌రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. సాయి వెన్నం, గిరిధర్‌రావు పోలాటి నిర్మిస్తున్నారు. మేకర్స్ సోమవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో అర్జున్ (సౌమిత్‌రావు) అనే వ్యక్తి ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతుంటాడు. శ్రేయాసి సేన్ తోడే అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొ స్తుంది. తనను నమ్మి వచ్చిన ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరమైనా వెళ్తాడనేది టీజర్ ద్వారా చెప్పే ప్రయ త్నం బాగుంది.