calender_icon.png 22 December, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిటెక్టివ్‌గా మారే కుర్రోడి కథ

16-10-2024 12:00:00 AM

రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మాతలు. సినిమా ఈ నెల 18న విడుదల కానున్న నేపథ్యంలో హీరో రామ్‌కార్తీక్ మంగళవారం మీడియాతో చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే.. “డైరెక్టర్ చెప్పిన ‘వీక్షణం’ స్క్రిప్ట్ నేను ఇప్పటిదాకా  విన్న కథల్లో డిఫరెంట్ ఫీల్ కలిగిం చింది. 

మూవీలో ప్రీ క్లుమైక్స్‌ను ఎవరూ ఊహించ లేరు.  పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసు కోవాలనే మనస్తత్వం వల్ల ఓ కుర్రాడు ఎలాంటి ఇబ్బం దులు ఎదుర్కొన్నాడు, డిటెక్టివ్‌గా ఎలా మారాడు అనేదే మెయిన్ పాయింట్.

హీరో ఇతరులను పరిశీలిస్తుంటే.. అతనికి తెలియకుండా మరో కన్ను అతన్ని చూస్తుంటుంది. అందుకే ‘వీక్షణం’ అనే టైటిల్ పెట్టాం. వాసు గారి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాను. ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి” అని తెలిపారు.