వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ‘మట్కా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘మట్కా’ కథేంటి?
-వాసు అనే అబ్బాయి కథే మట్కా. తను బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్ వస్తాడు. 1958 నుంచి 82 వరకు తను అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తాం.
మట్కా కింగ్ రతన్ ఖత్రి క్యారెక్టర్‌తో వాసుకి పోలిక ఉందా?
ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని దర్శకుడు భావించారు. రతన్ ఖత్రిది ముంబై నేపథ్యం. తను పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. పైగా ఆయన చేసిన పనులను జనాలు రూమర్స్‌లా మాట్లాడుకోవడమే తప్పితే కొన్నిటికి ఆధారాలు లేవు. మా డైరెక్టర్ ఒకవేళ తనే మట్కా కింగ్ అయి ఉంటే తను ఎలా చేసేవారో అని ఆలోచించి ఆయనకు వచ్చిన ఐడియాస్‌తో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేశారు.
ఈ సినిమాలో సందేశం ఉంటుందా?
-మట్కా సందేశాత్మక చిత్రం కాదు. ఇది ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిలిం. వాసు క్యారెక్టర్‌లో తనకి ఎవడూ హెల్ప్ చేయడనే ఒక బాధ, కోపం కనిపిస్తుంది. వాసు క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తున్న కొద్దీ తను చెప్పేది కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది.
డైరెక్టర్ కరుణ కుమార్ గురించి?
-కరుణ కుమార్ సెన్సిబిలిటీస్ నాకు చాలా నచ్చాయి. ఆయన గ్రౌండ్ రియాలిటీని షుగర్ కోటింగ్ లేకుండా చెబుతుంటారు. అది నాకు చాలా నచ్చింది. ఆయన చాలా మంచి రైటర్. సెట్లో అప్పటికప్పుడే ఇంప్రవైజ్ చేసి చాలా అద్భుతమైన మాటల్ని రాయగలరు. ఇందులో ధర్మం అనే టాపిక్‌పై వచ్చే డైలాగ్ అప్పటికప్పుడు రాసిందే.
మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
తనది వాసుతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే క్యారెక్టర్. ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుంది. ఆమె లక్కు మాకు ఫేవర్ అవుతుందని అనుకుంటున్నాను. నోరా ది కూడా మంచి క్యారెక్టర్. అద్భుతంగా చేసింది.