calender_icon.png 25 October, 2024 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరం చుట్టూ అల్లుకున్నదీ కథ

25-10-2024 12:00:00 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఇందులో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మిస్తున్నారు.

సినిమా ఈనెల 31న దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ గురువారం వైజాగ్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేసింది. మధ్యాహ్నమే చీకటి పడే భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైన కృష్ణగిరి గ్రామంలో పోస్ట్‌మ్యాన్ పేరు అభినయ వాసుదేవ్.

ఓ రోజు అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరంలో ఏముందో చెప్పమని బెదిరిస్తూ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడారు? అనే అంశాలు ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చివరలో ‘జాతర మొదలుపెడదామా..’ అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్ రావడం సర్‌ప్రైజ్ ట్విస్ట్ ఇచ్చింది.

ఈ సినిమా గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వాస్ డానియేల్, సతీశ్‌రెడ్డి మాసం; మ్యూజిక్: సామ్ సీఎస్; ఫైట్స్: రియల్ సతీశ్, రామ్‌కృష్ణన్, ఉయ్యాల శంకర్.