18-04-2025 12:35:03 AM
తనపై దాడి చేశారని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రామా
రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: లావణ్య.. సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మధ్య చెలరేగిన గొడవ సుఖాంతమైంది. ఎట్టకేలకు పోలీసుల చొరవతో వారిని లావణ్య గురువారం ఇంట్లోకి అనుమతించింది. నగరంలోని మూసాపేట ప్రాంతం లో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అయిన బసవరాజు, రాజేశ్వరి దంపతులు బుధవారం కోకాపేటలోని బోల్ వరడ్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వద్దకు వచ్చారు.
తమ కుమారుడు రాజ్ తరుణ్ కు చెందిన విల్లాలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే చాలాకాలంగా అందులో ఉంటున్న రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అందుకు వారిని అనుమతించలేదు. దింతో వారు గురువారంతెల్లవారుజాము వరకు ఇంటి బయ టే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకొని లావణ్యకు నచ్చజెప్పి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి పంపించడంతో కథ సుఖాంతమైంది.
లావణ్య మా కోడలు కాదు..
లావణ్య తమ కోడలు కాదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరి దంపతులు స్పష్టం చేశారు. లావణ్య తమ కుమారుడితో కేవలం సహజీవనం మాత్రమే చేసిందని వెల్లడించారు. అయితే తాను రాజ్ తరుణ్ వివాహం చేసుకున్నానని...
అతడు తన భర్త అని లావణ్య స్పష్టం చేసింది. కోకాపేట్ లో ఉన్న విల్లా రాజ్ తరుణ్ ది అని, కుమారుడి ఇంట్లో తాము ఉంటామని దీనికి నిరాకరించడానికి లావణ్య ఎవరని వారు ప్రశ్నించారు. అయితే తాము ఇద్దరం కష్టపడి విల్లాను కొనుగోలు చేశామని లావణ్య తెలిపింది.
నాపై దాడి చేశారు : లావణ్య ఫిర్యాదు
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరి దంపతులతో వచ్చిన కొందరు తనపై దాడి చేశారని, అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ లావణ్య నార్సింగి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించి తన ప్రైవేటు పారట్స్ ను తాకారని ఆగ్రహం వ్యక్తం చేసింది.