టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాంబిరెడ్డి’. విభిన్నమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యంగ్ హీరో తేజ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. మునుపెన్నడూ చూడని సరికొత్త కథను ‘జాంబిరెడ్డి’ చిత్రంతో ప్రశాంత్ వర్మ పరిచయం చేశాడు. కామెడీ, భయం, డివోషనల్ కలబోతగా ఈ సినిమా ఉంటుంది.
దీంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే జాంబీస్ అనే పదం బాగా వైరల్ అయిపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం సీక్వెల్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ‘జాంబిరెడ్డి’కి సీక్వెల్ కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారని టాక్.
అయితే ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో ప్రశాంత్ వర్మ బిజీగా ఉండటంతో సీక్వెల్ చేసే పరిస్థితిలో లేరట. కాబట్టి దీని దర్శకత్వం వేరొక దర్శకుడు చూస్తారని సమాచారం. అలాగే ఈ సినిమా బాధ్యతను సితార సంస్థ స్వీకరిస్తుందట. సరైన దర్శకుడు దొరికిన వెంటనే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతారని సమాచారం. ఆ తరువాత ‘జాంబిరెడ్డి’ చిత్రం సీక్వెల్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది.