రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..!
- సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం
- 23,100 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంత ర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలతో ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, ఎల్‌అండ్‌టీ షేర్లలో విక్రయాఉ సూచీలపై మరిత ఒత్తిడి పెంచాయి. బీఎస్‌ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ-50 సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి.
బీఎస్‌ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1031.61 పాయింట్ల (1.35 శాతం) నష్టంతో 76,347.26 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 77,128.35 పాయిం ట్ల గరిష్ఠం నుంచి 76,249.72 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ-50 సూచీ నిఫ్టీ 345.55 పాయింట్లు (1.47 శాతం) నష్టంతో 23,085.95 పా యింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్ లో 23,340.95 పాయింట్ల గరిష్టానికి, 23, 047.25 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.
ఫలితంగా ఇన్వెస్టర్లు రూ.14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయా రు. ఎన్‌ఎస్‌ఈ-50లో 46 స్టాక్స్ నష్టపోయా యి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ ఎల క్ట్రానిక్స్ నష్టపోయాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇండస్‌ఇండ్ బ్యాంకు సహా నాలుగు స్టా క్స్ 0.78 శాతం వరకూ లాభ పడ్డాయి.
బీఎస్‌ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో జోమాటో, పవ ర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇం డస్‌ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ 80. 83 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, ఔన్స్ బంగారం ధర 2708.డాలర్ల వద్ద నిలిచింది.