11 రోజుల్లో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం
కరీంనగర్, జనవరి 17 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం మరో పదకొండు రోజుల్లో ము గియనుంది. పాలకవర్గం కొలువుతీరిన కొత్త లో డంపింగ్ యార్డు సమస్యను స్మార్ట్ సిటీ నిధులతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేతలు ఆ దిశగా శ్రద్ధ వహించకపోవడంతో తరచు మంటలు వ్యాపిస్తున్నాయి.
తాజాగా బుధవారం కూడా మంటలు వ్యాపించడం తో చుట్టుపక్కల ప్రజలు భయాం దోళనకు గురయ్యారు. శివారు ప్రాంతాలతోపాటు బైపాస్ రోడ్డులో తరచు పొగ కమ్ముకుం టుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పలుమార్లు ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. కరీంన గర్ నగరంలో 60 డివిజన్లు ఉండ గా, ప్రతినిత్యం 185 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి జరుగుతుంది.
ఇళ్ల నుండి సేకరించిన చెత్తను మానేరు నదీ తీరాన ఆటోనగర్‌లోగల దంపింగ్యా ర్డుకు చేరవేస్తున్నారు. బయోమైనింగ్ ద్వారా చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలని, స్మా ర్ట్ సిటీ నిధుల నుంచి 16 కోట్ల రూపా యలతో బయోమైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ పనులు నిలిచిపోవడంతో మళ్లీ పూర్వ పరిస్థితి తరచు తలెత్తుతుండడం జరుగుతుం ది.
గుట్టలు గుట్టలుగా పేరుకుపో తున్న దంపింగ్ యార్డులోని చెత్తను తొలగిం చే ప్రక్రియ అంతంత మాత్రంగా ఉండడం తో తరచు మంటలు చెలరేగి ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మొగుం పూర్ వద్ద డంపింగ్యార్డుకు స్థల సేకరణ చేయగా గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఆగిపోయింది.
బయోమై నింగ్కు సంబం ధించి ప్రస్తుత పాలకవర్గం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకు ఒక సంస్థకు అప్పగించగా, బయోమై నింగ్ ప్రక్రియ తొలుత ప్రారంభించి ఏడాది తర్వాత నిలిపివే శారు. తిరిగి మళ్లీ ప్రారంభించి నిలిపివే యడంతో చెత్త కుప్పలు పేరుకుపో తున్నాయి. ప్రస్తుతం 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది.
ఇప్పటి వరకు కేవలం 64 వేల మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే శుద్ధి చేశారు. దీనిపై అధికార యంత్రాంగం శ్రద్ధ చూపకుంటే ఆ ప్రాంతాలు కాలుష్యపర మవుతాయి.