calender_icon.png 8 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల పోరాటంతోనే రాష్ట్రం ఏర్పడింది

08-11-2024 01:27:38 AM

  1. కాంగ్రెస్ రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం
  2. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
  3. అశోక్‌నగర్‌లో రావుస్ అకాడమీ ప్రారంభం

ముషీరాబాద్, నవంబర్ 7 (విజయక్రాం తి): నిరుద్యోగుల పోరాటం ద్వారానే తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడితేనే నియామకాలు దక్కుతాయని నిరుద్యోగులు భావించారని పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్ అశోక్‌నగ ర్‌లో రావుస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావుస్ అకాడమీని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామమన్నారు.

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, దేశానికే ఆదర్శం గా నిలుస్తామని చెప్పారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నా రు. సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభు త్వం తరపున లక్ష రూపాయలు అందిస్తున్నామని చెప్పారు.

పోటీ పరీక్షలకు సిద్ధ మవు తున్న విద్యార్థులకు ఇలాంటి అకాడమీలు ఎంతో దోహదపడుతాయని ఆయ న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ దినకర్‌బాబు, రావుస్ అకాడమీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుడు గుర్రం శంకర్ తదితరులు పాల్గొన్నారు.