ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): 1,200 మంది బలిదానా లాతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇచ్చిన హామీలు విస్మరించినం దుకే బీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నిజామాబా ద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లా డారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశం ఇవ్వకుండా అనవసర విషయాలపై చర్చ పెట్టి సభ సమయాన్ని వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. రెండు పార్టీలు తోడుదొంగల్లా వ్యవహరించి యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
పది రోజులు కూడా అసెంబ్లీ నిర్వహించకుండా, నియోజకవర్గ సమస్యలు వినకుండా, ఎమ్మెల్యేల ఆవేదనను పట్టించుకోకుండా సభను ముగించడం తగదన్నా రు. ఆరు గ్యారెంటీల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నా రు. ప్రభుత్వం 420గా వ్యవహరించి ప్రజలను మోసం చేసిందని సూర్యనారాయణ ధ్వజమెత్తారు.