calender_icon.png 12 January, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు స్టేట్ టీచర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు

11-12-2024 08:09:56 PM

భద్రాద్రి జిల్లా కమిటీ...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంట్రాక్టు పద్దతులతో నియమితులైన సమగ్ర శిక్ష బోధన, బోధనేతర ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా చాలిచాలని వేతనాలతో పని చేస్తున్న, గత ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోలేదు. వీరు సుమారు 30,000 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. 2023లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నెలరోజులు సమ్మె చేసిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేస్తుందని ఆశతో వీరి న్యాయమైన డిమాండ్లతో ఈ నెల 6వ తారీఖు నుండి జిల్లా కేంద్రాలలో రిలే నిరాహారదీక్ష చేసిన ప్రభుత్వం నుండి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 10వ తారీఖు మంగళవారం నుండి నిరవధిక సమ్మెచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలైనా ఢిల్లీ, రాజస్థాన్, మణిపూర్ లలో పని చేసిన సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బందిని క్రమబద్దీకరణ చేశారని అదేవిధంగా తెలంగాణలో కూడా వీరిని క్రమబద్ధీకరణ చేయాలని మహిళా ఉద్యోగులకు సాధారణ మహిళా ఉద్యోగి లాగ 180 రోజులు ప్రసూతి సేవలు ఇవ్వాలని, వారి వెట్టిచాకిరిని గుర్తించి కనీస వేతనాలు, ఉద్యోగులు భద్రత కల్పించాలని, జీవిత భీమా 25 లక్షలు వరకు కల్పించాలని ఎస్.టి.యు.టి.ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ, వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తెలిపారు. అంతే కాకుండా ఎస్.టి.యు.టి.ఎస్ రాష్ట్ర కమిటీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బి.మంగిలాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.లాల్ మహమ్మద్, శంకర్, మోహన్, చందర్, సుబ్బారావు, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.