హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. గత రెండ్రోజులుగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సోమవారం మెదక్, ఆదిలాబాద్ జిల్లా ల్లో అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ వెల్లడిం చింది.
సాధారణంగా డిసెంబర్ మూడోవారం తర్వాత ఉండే చలి తీవ్రత ఇప్పుడే మొదలైంది. దీన్ని బట్టి మున్ముం దు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. రాబోయే రెండు నెల లు చలి పంజా విసురుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా రు.
చలికి తోడు పొగమంచు తోడయ్యే ప్రమాదం ఉందని.. ఉదయం వేళ వాహనదారులు, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.