calender_icon.png 8 January, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు తేవాలి

07-01-2025 10:44:11 PM

రామాయంపేట క్రీడలకు నేలవు

ఎల్లవేళలా క్రీడలకు క్రీడాకారులకు చేయూతనిస్తా

రామాయంపేట మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట: ఆటలు ఆరోగ్యానికి మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని ప్రతి ఒక్కరూ ఆటలను సాధన చేయాలని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామాయంపేట పట్టణానికి చెందిన యువజ్యోతి ఆర్చరీ, ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాథమిక విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సాధన చేసి రామాయంపేట మెదక్ పట్టణాలకే కాకుండా రాష్ట్రానికి కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో ఫుట్బాల్లో పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. సంబంధం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడలు సాధన చేయడం వల్ల ఆరోగ్యం, మానసిక శక్తి పెరుగుతుందని అన్నారు. ఒత్తిడి లేక గెలుపు ఓటములపై అవగాహన పెరుగుతుందన్నారు.

రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనబరిచినా కస్తూరి హర్షవర్ధన్ ను ఆయన ప్రశంసించారు. జాతీయస్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుడు శరత్చంద్ర బుల్లెట్ ను కూడా ఆయన ఆశీర్వదించారు. హైదరాబాద్ ఫుట్బాల్ టోర్నిలో ప్రతిభ చూపిన యువజ్యోతి క్రీడాకారులు పాటు భానుదాస్ అభిరామ్ గోపాలస్వామి తదితరులకు క్రీడా ధృవపత్రాలు అందజేశారు. అంతకుముందు ఆయన శివ జ్యోతి ఆర్చరీ ప్రాథమిక శిక్షణ కేంద్రాన్ని బాణం వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాతం రావు, పోచమ్మల అశ్విని, శ్రీనివాస్, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పుట్టి రాజు, శ్రీధర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, శంకరయ్య, కుమార్ సాగర్, మార్నింగ్ స్టార్స్ రామాయంపేట క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బసనపల్లి మల్లేష్, రెడ్డమైన నరేష్, చింతల స్వామి, బాలకృష్ణ, సుంకోజి దామోదర్, అమరేందర్ రావు, దోమకొండ యాదగిరి, నమూళ్ళ సందీప్ తదితరులు పాల్గొన్నారు.