17-02-2025 07:21:01 PM
బిఆర్ఎస్ నేత డాక్టర్ రాజా రమేష్..
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
71 కిలోల కేక్ కటింగ్..
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలు సంతోషాంగా ఉండాలంటే రాష్ట్రంలో మరల కేసీఆర్ పరిపాలన రావాలని సంవత్సరమున్నర కాంగ్రెస్ పరిపాలనలో విసిగిపోయిన ప్రజలకు అర్దం అయిందని బిఆర్ఎస్ నేత డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను జిల్లాలోని చెన్నూరు పట్టణంలో డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా చెన్నూరు పట్టణంలోని శివాలయంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం రక్తదానం శిబిరం నిర్వహించి, స్వయంగా రాజా రమేష్ రక్త దానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్ రాజా రమేష్ తో పాటు సుమారు 30 మంది పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు.
అనంతరం ఐబి చౌరస్తాలోని దర్గాలో మైనార్టీలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 71 కిల్లోల కేక్ కట్ చేసి, తమ అభిమాని చాటి, అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ... కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. బిఆర్ఎస్ అగ్ర నేత కేటిఆర్ పిలుపుమేరకు బాల్క సుమన్ ఆదేశానుసారం కెసిఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ వెన్నంటే ఉండి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నిర్వహిస్తూ, విజయవంతం చేస్తామని తెలిపారు.
కేసీఆర్ ను మరల ముఖ్యమంత్రి చేసి, బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకు బిఆర్ఎస్ ప్రతి కార్యకర్త సైనికుడిగా అలసిపోకుండా, కష్టపడతామన్నారు. ఆరు దశాబ్దాలు సాధ్యం కానటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్నామని కేసీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు నవాజోద్దీన్, మంత్రి బాపు, సాధబోయిన కృష్ణ, దామోదర్ రెడ్డి, సమ్మిరెడ్డి, నాయిని సతీష్, సాంబ గౌడ్, రివెల్లి మహేష్, సురేష్ రెడ్డి, మోతే తిరుపతి, మేడి తిరుపతి, విద్యాసాగర్, తుమ్మ రమేష్, అయోగ్, ఆరిఫ్, వేముల మహేందర్, వెంకట్ రాజం, నిమ్మల సంతోష్, సుధాకర్, భారతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ, యువజన, మైనార్టీ, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.