calender_icon.png 17 January, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవదానంలో రాష్ట్రం నంబర్ వన్

06-08-2024 01:32:39 AM

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): అవయవదానంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అవయవదాన ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కోఠిలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సోమవారం ఆయన ‘జీవన్‌దాన్’ బృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా జీవన్‌దాన్ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ స్వర్ణలతను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అవయవ దానం అంశంలో జీవన్‌దాన్ విభాగం జాతీయ పురస్కారం అందుకోవడం అభినందనీయమన్నారరు. ఇకముందు కూడా అవయవ దానంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వెద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన సంస్థ ఎండీ హేమంత్ సహదేవ్‌రావు పాల్గొన్నారు.