calender_icon.png 31 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పాలకుల తీరుతోనే అప్పుల ఊబిలో రాష్ట్రం

30-01-2025 12:05:08 AM

  • వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం  
  • అన్యక్రాంతమైన వర్సిటీ భూములను తిరిగి తీసుకుంటాం 
  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఇష్టాగోష్టి  

రాజేంద్రనగర్, జనవరి 29 : గత పాలకుల తీరుతోనే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వడ్డీలు చెల్లించడం తలకు మించిన భారంగా మారిందన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్ లోనే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖా ముఖిగా సమావేశమై ప్రత్యక్షంగా మాట్లా డారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతాం శమన్నారు. 

రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, వడ్లకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదికి వ్యవసాయ రంగానికి సుమారు 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. తన సొంత జిల్లాలో నెలకొన్న అగ్రికల్చర్ వర్సిటీ అంటే తనకెంతో అభిమానం అన్నారు. తాండూర్ కందికి భౌగోళిక గుర్తింపు లభించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడం సంతోషదాయకం అని స్పీకర్ అన్నారు.

ఈ గుర్తింపు వెనక యూనివర్సిటీ కృషి ఎంతో ఉందన్నారు. విశ్వవిద్యాలయం భూములు, ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి నిధులు, నియామకాలు, బోధన బోధనేతర సమస్యలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉపకులపతిని తీసుకొని ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల అస్తవ్యస్త పరిపాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.

గత పాలకులు చేసిన అప్పులు వడ్డీలు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి తలకు మించిన భారం అయిందన్నారు. ఉపకులపతిగా నియమితు లైన కొన్ని నెలల్లోనే ఆల్దాస్ జానయ్య విశ్వవిద్యాలయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభినం దించారు.

అన్యాక్రాంతం, ఆక్రమణలకు గురైన భూముల్ని వెనక్కి తీసుకుంటామ న్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి నిధులు పెంచాలని, నియామకాలు చేపట్టా లని, కొత్త వసతి గృహాలు నిర్మించాలని విద్యార్థులు కోరారు.  విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.