calender_icon.png 22 March, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో రాష్ట్రం పరువుపోతోంది.. X ఢిల్లీ వ్యాపారాలతో రాష్ర్టం పరువు తీశారు

22-03-2025 01:22:25 AM

దేశంలో రాష్ట్రం పరువుపోతోంది..

  1. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి
  2. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రికి గిన్నీస్ రికార్డు వస్తుంది
  3. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉన్నదని, దీనివల్ల దేశంలో రాష్ట్రం పరువుపోతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బడ్జెట్‌లో దూరదృష్టి లోపించిందని, ఎలాంటి విప్లవాత్మక కేటాయింపులే లేవని దుయ్యబట్టారు. శుక్రవారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో కవిత మాట్లాడారు.

కాంగ్రెస్ మార్క్ కరప్షన్, కన్నింగ్‌నెస్‌కి ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉన్నదన్నారు. అప్పులపై కాంగ్రెస్ పార్టీ పదేపదే దుష్ర్పచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అబద్ధమని బడ్జెట్‌తో తేలిపోయిందన్నారు. కేవలం కేసీఆర్‌ను నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారని కవిత ఆరోపించారు.

అబద్ధాలు చెప్పడంలో సీఎంకు గిన్నీస్ రికార్డు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామన్నారు. బడ్జెట్ స్పీచ్‌లో రాజీవ్‌గాంధీ పేరు ఏడు సార్లు, సోనియాగాంధీ  పేరు ఒకసారి, ఇందిరాగాంధీ పేరు 11సార్లు ప్రస్తావించారన్నారు.

పేర్లు తీసుకోవడం, ప్రతీ పథకాన్ని గేమ్‌ఛేంజర్ అనడం తప్పితే అందులే ఏమీ లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారని విమర్శించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చొని సీఎం పరిపాలన చేస్తున్నారని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేస్తోందన్నారు.

ఢిల్లీ వ్యాపారాలతో రాష్ర్టం పరువు తీశారు 

  1. కరప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్ 
  2. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి సీతక్క కౌంటర్

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): “రాష్ర్టం పరువు తీసింది ఎవరు? ఢిల్లీ వ్యాపారాలతో రాష్ర్టం పరువు తీసింది మీరు.. మీ కుటుంబం. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు” అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చురకలు అంటించారు.

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో దేశంలో తెలంగాణ పరువు పోతోందని శుక్రవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ది త్యాగాల చరిత్ర అన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్ అని విమర్శించారు.

బీఆర్‌ఎస్ మహిళలకు అడుగడుగున అన్యాయం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ మొదటి ప్రభుత్వం మహిళా మంత్రి లేకుండానే పాలన సాగించారన్నారు. మహిళలు పొదు పు చేసుకున్న రూ.1,800 కోట్ల అభయ హస్తం నిధులను ఇవ్వలేదన్నారు. పావలా వడ్డీ ఇవ్వలేదని, మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3,700 కోట్ల వడ్డీలు చెల్లించలేద న్నారు.

తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని సీతక్క ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ డీఎన్ ఏలోనే కరప్షన్ ఉందని, నాడు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకు తున్నారని ఆరోపించారు.

ఉద్యోగాల విషయంలో బీఆర్‌ఎస్ అబద్ధాలు చెబు తోందన్నారు. బీఆర్‌ఎస్ నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. రాష్ర్టం పరువు తీసింది బీఆర్‌ఎస్సేనని, తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు.