26-03-2025 12:55:46 AM
బూర్గంపాడు,మార్చి 25(విజయక్రాంతి): ఆరోగ్య రంగంలో ఆశాలు వెన్నెముక అని పెద్ద పీట వేస్తామని గొప్పగా పొగడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాలను అరెస్టు చేయించడం నిర్బంధించడం సరికాదని, ఆశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సిఐటియు మండల క న్వీనర్ పాండవుల రామనాథం అన్నారు.
బూర్గంపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్లే కారడ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాండవుల రామనాథం మాట్లాడుతూ ఆశాల సమస్యలపై ఛలో హైదరాబాద్ కమీషనర్ కార్యాల యం ముట్టడిలో ఆశాలను అక్రమ అరెస్టు చేశారని ఆయన అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాల సందర్భంగా ఆశాలకు ఫికస్డ్ గా గౌరవ వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని ఆయన అన్నారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని, ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో అడుగడుగు నా బస్టాండ్ రైల్వే స్టేషన్లలో అరెస్ట్ చేసి నిర్బంధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పట్టుతుందని ఆయన అన్నారు.
రాబోయే జెడ్పిటిసి, ఎం పీటీసీ,సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా కెవి పిఎస్ మండల కన్వీనర్ రాయల్ వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ఈ తారా దేవి, ఎం.నాగమణి, టి. రత్న కుమారి, కే పార్వతి, పి చిట్టెమ్మ, జి.తిరుపత మ్మ, బి భారతి,జి నాగేశ్వరి, డిబాయమ్మ తదితరులు పాల్గొన్నారు.