calender_icon.png 26 December, 2024 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచాలి

04-12-2024 08:37:59 PM

ప్రభుత్వం ఇచ్చిన హమీలను నేరవేర్చాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు పిక్స్‌డ్ వేతనం రూ.18 వేల వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆశవర్కర్లు కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోఠిలో జరిగిన ధర్నాలో పరిష్కరిస్తామని  కమిటి వేస్తారన్నారు. వేసిన కమిటి ఆశల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారన్నారు. డైరెక్టర్ హమీ ప్రకారం అక్టోబర్ తోమ్మిదిన ఆశా వర్కర్ల నిర్వహకసమ్మెను విరమించిన నేటికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి గత 15 రోజలు సమ్మె కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టో పొందుపర్చిన హమీలు విభజన చలో కోఠిలో కమిషనర్ ఇచ్చిన హమీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఆశలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలన్నారు. ఏఎన్‌ఎం పూర్తి చేసిన ఆశలకు ఏఎన్‌ఎం జీవెం పోస్టుల ప్రమోషన్ కల్పించాలన్నారు. వెయిటేజ్ మార్కులు వెంటనే నిర్ణయించాలన్నారు.