calender_icon.png 31 January, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయరాజుకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సింగరేణికి గర్వకారణం

11-12-2024 04:55:26 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని సింగరేణి ఉద్యోగి, కవి జయ రాజ్ తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రకు గుర్తింపుగా తామ్ర పత్రం, నగదు పురస్కారంతో సన్మానించబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సింగరేణీయులందరికీ గర్వకారణమని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. కవిగా ప్రజా చైతన్య ఉద్యమాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, అక్షరాస్యత పెంపునకు తన రచనల ద్వారా ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది మంది కళాకారుల జాబితాలో జయ రాజుకు చోటు దక్కడం సింగరేణీయులందరికీ లభించిన గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, డైరెక్టర్ (పర్సనల్, పి అండ్ పి) జి.వెంకటేశ్వరరెడ్డి, జీఎం (కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, జీఎం (మార్కెటింగ్)  రవి ప్రసాద్, జీఎం(ఐఆర్, పీఎం) కవితా నాయుడు మాట్లాడుతూ.. ప్రజా కవిగా జయ రాజ్ ఎన్నో స్ఫూర్తి గీతాలు రాశారని కొనియాడారు.