calender_icon.png 27 December, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

02-12-2024 05:53:16 PM

బీఆర్ఎస్వి జిల్లా ఇన్చార్జ్ ముస్తఫా 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వేదం చేస్తుందని జిల్లా ఇన్చార్జి ముస్తఫా అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి సూచనలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో గురుకుల బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గురుకులాలలో వరుస మరణాలు, ఆహారం కల్తీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. కనీసం ఇప్పటివరకు కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేయకుండా విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా గురుకుల పాఠశాలలను దెబ్బతీస్తున్నాడు ఆరోపించారు. బిఆర్ఎస్ పాలనలో నాడు గురుకులం సీట్ల కోసం పోటీ పడ్డ సందర్భం నుండి కాంగ్రెస్ పాలనలో నేడు హాస్పిటల్ బెడ్ల కోసం పోటీ పడేలా మార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు సాయి శ్రావణ్, శ్రీకాంత్, ప్రవీణ్, సాగర్, రామ్ శేఖర్, అరుణ్, తాజ్, శంకర్ పాల్గొన్నారు.