calender_icon.png 15 January, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది

01-12-2024 08:23:57 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన కుల గణనలో  రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ, రాష్ట్ర ఉపాధ్యాయ మహసభలకు ముఖ్యఅతిధిగా హజరై ఆయన మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల అభ్యునతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా తనను సలహదారుగా నియమించిందన్నారు. అంబేద్కర్ పూలే ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతనంగా చేపట్టిన కుల గణన 90 శాతం రాష్ట్రంలో పూర్తయిందన్నారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన విషయంలో విజయం సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కులగణన ఆధారంగానే రిజర్వేషన్‌లు ఉంటాయన్నారు. ఎస్సీ,ఎస్టీ,ఉపాధ్యాయ సంఘానికి రికైజనేషన్ కొరకు ముఖ్యమంత్రితో మాట్లాడి చేపిస్తానని హమీ ఇచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్ తరాలకు బాటలు  వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 50 వేల ఉద్యోగాలు అందించినట్లు తెలిపారు.డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశామన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి చైర్మన్లను కూడా నియామించిందన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షపార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కొంగల వెంకటి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దన్‌సింగ్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, ఎస్సీ,ఎస్టీ, బీసీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.