సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..
పెద్దపల్లి (విజయక్రాంతి): అభివృద్ది, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. పెద్దపల్లి మండలం కాపులపల్లి నుండి గోపయ్యపల్లి వరకు రూ. కోటితో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులను శుక్రవారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్లు విస్తరణ చేస్తున్నామని అన్నారు. అంతర్గత రహదారులను అభివృద్ది చేసి ప్రజారవాణా మరింత మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వానాకాలంలో సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అదనంగా చెల్లించామని తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రానున్న సంక్రాంతికి రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కిందన్నారు. గత 10ఏళ్ళ పాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినా ఆర్ధిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈఈ గిరీష్ బాబు, డిఈఈ శంకరయ్య, మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్లు, విండో ఛైర్మన్లు చింతపండు సంపత్, మాదిరెడ్డి నర్సింహ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక డిజైన్లలో బట్టలను కుట్టేందుకు మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం..
ముస్లిం సోదరిమణులకు పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లను ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణ రావు అందించారు. అనంతరం ఎమ్మెల్యేను సొసైటీ వారు, మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన డిజైన్లలో బట్టలను తయారు చేయడం ఎంతో అవసరమన్నారు.