దక్షిణాదిలోనే అతిపెద్దదిగా భావిస్తున్న వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్)కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వడం ముదావహం. ఏడు సంవత్సరాల నత్తనడక తర్వాత ఇన్నాళ్లకు ఈ పవర్ ప్లాంట్ పనులు ముందుకు కదిలాయి. మరో ఆరు నెలల్లో మొదటి విడతగా 1600 మెగావాట్లు, రెండో విడతలో 2400 మెగావాట్లు విద్యుదుత్పత్తికి అధికారులు చర్యలు తీసు కుంటున్నట్టు వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాదికల్లా పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సాధించగలిగితే అంతకన్నా కావాల్సిందేముంటుంది!
రామ్‌గోపాల్, మల్లాపూర్, హైదరాబాద్