calender_icon.png 28 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు వైఫల్యాలతోనే ఎస్సెల్బీసీ ప్రమాదం

28-02-2025 01:24:08 AM

రైతు సంఘం రాష్ట్ర కమిటీ  సభ్యుడు శ్రీశైలం

మునుగోడు,ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ  సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు . గురువారం మండల కేంద్రంలోని అమరవీరుల  స్మారక భవన్లో ఆ సంఘం మండల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా సొరంగంలో కార్మికులు , ఇంజినీర్ల ఆచూకీ లభించకపోవడం దురదృష్టకరమన్నారు.

ప్రమాదాన్ని సాకుగా చూపి ప్రాజెక్టును నిలిపేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ ఏకకాలంలో రైతు భరోసా చెల్లించాలి కోరారు.  రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేశ్ , మండల కార్యదర్శి వేముల లింగస్వామి , మిర్యాల భరత్ , వరికుప్పల ముత్యాలు, సీనియర్ నాయకులు యాట యాదయ్య , దొండ వెంకన్న , సీఐటీయూ మండల సీనియర్ నాయకులు యాసరాని శ్రీను, కట్ట లింగస్వామి , పర్సగొని లింగస్వామి పాల్గొన్నారు.