calender_icon.png 25 November, 2024 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శ్రీరంగం’ వెంచర్.. పొంచి ఉన్న డేంజర్

29-08-2024 04:27:24 AM

  1. రంగంపేట శివారులో లే అవుట్ లేకుండానే వెంచర్ 
  2. చిన్నకుంట వెడల్పు చేయించి.. పెద్దకుంట చెరువు మధ్య నుంచి రోడ్డు 
  3. అధికారుల అండదండలతో చెరువులను చెరబట్టిన ఓ రియల్టర్

మంచిర్యాల, ఆగస్టు 28 (విజయక్రాంతి): వ్యవసాయానికి, భూగర్భజలాలకు ప్రధాన ఆధారమైన చెరువులను కొందరు కబ్జా చేస్తున్నారు. దీంతో ఏటా చెరువులు కుంచించుకు పోతున్నాయి. వానకాలంలో చెరువులు నిం డినప్పుడు నివాస స్థలాల్లోకి వరద వచ్చి నీట మునుగుతున్నాయి. చెరువుల కింద ఆ యకట్టు సైతం ఏటికేడు తగ్గుతూ వస్తున్నది. ఇలా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రంగంపేట శివారులో పెద్దకుంట, చిన్నకుంట, చీకటి వెలుగుల కుంట, కుమ్మరికుంట, పట్టణం మధ్యలో రాముని చెరువు, చింతల చెరువు (రిజర్వాయర్), సాయికుంట చెరువు, గర్మిళ్ల పోచమ్మకుంట, దొరగారిపల్లిలోని చింతల చెరువుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.

రంగంపేట శివారులోని ఎనిమిది ఎకరాల్లో ఓ రియల్టర్ ‘శ్రీరంగం హిల్స్’ పేరుతో ఎలాంటి లే అవుల్ లేకుండానే వెం చర్ వేశాడు. రెండు చెరువుల మీదుగా రోడ్డు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నాడు. రోడ్డు కోసం చిన్నకుంట చెరువు కట్ట పెంచాల్సి ఉన్నది. దీంతో రియల్టర్ చెరువులోని మట్టిని తీయి ంచి, కట్ట వెడల్పు చేయించాడు. అనంతరం కంకర వేయించి రోడ్డు వేశాడు. ఒకప్పుడు ఎడ్ల బండ్ల బాట ఉండే చెరువు కట్ట ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు మారింది. వెంచర్‌కు రోడ్డు కోసం పక్కనే పెద్దకుంట చెరువు మధ్యలో నుంచే ఏకంగా రోడ్డు తీశాడు. పెద్దకుంట చెరువు కట్టను కూడా కోసి దాని నుంచే సు మారు రెండు కిలోమీటర్లు రోడ్డు వేశాడు.

చెరువుల చుట్టూ కబ్జాలు..

సర్వే నెంబర్ 76లో 13.30 ఎకరాలలో పెద్దకుంట చెరువు ఉండగా, 104 సర్వే నెంబర్‌లో 16.14 ఎకరాల విస్తీర్ణంలో చిన్నకుంట ఉండేది. చెరువుల కింద వందలాది ఎకరాల ఆయకట్టుకు నీరందేది. అలాంటి చెరువులు ఇప్పుడు కబ్జాకోరుల చెరలో చిక్కుకున్నా యి. చెరువుల చుట్టూరా ఉన్న భూములను రియల్టర్లు, ఇటుక బట్టీల యాజమాన్యాలు, రైతులు కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నా యి. పూడిక తీయకపోవడం, అక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించకపోవడంతో ప్ర స్తుతం చెరువుల ఆనవాళ్లు లేకుండాపోయా యి. కొందరైతే ఏకంగా నీటిని తూములను ంచి బయటకు వదులుతూ శిఖంను కబ్జా చేశారు. మరో రెండేండ్లలో అసలు చెరువుల ఆనవాళ్లు లేకుండాపోతాయని స్థానికులు ఆ ందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతు న్నా కనీసం ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో విమర్శలకు తావిస్తున్నది 

‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు..

ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారు ల అండదండలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా వెంచర్ల దందా కొనసాగి స్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వద్ద తక్కువ ధరకు వ్యవసాయ భూ ములను కొనుగోలు చేసి, ఎలాంటి లే అవు ట్ లేకుండానే వెంచర్లు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంచర్ల కోసం చెరువులు, కుంటల భూములను కబ్జా చేశారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి, కబ్జాకోరుల చెర నుంచి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ భూములను విడిపిం చాలని కోరుతున్నారు.