calender_icon.png 12 February, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జారాయుళ్లు బీఆర్‌ఎస్ నాయకులే!

12-02-2025 01:11:39 AM

* దేవాదాయ శాఖ భూములను ఎక్కువగా చెరపట్టింది వాళ్లే

* ఎంపీ ఈటల భూములపై విచారణ చేస్తాం

* మీడియాతో చిట్‌చాట్‌లో  మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి): గత పదేళ్లలో దేవాదాయ శాఖ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కబ్జా చేసిన వారిలో బీఆర్‌ఎస్ నాయకులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆమె మీడియాతో చిట్‌చాట్ చేశారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చిన దే వారాయాంజల్ భూములపై కూ డా విచారణ చేయిస్తామన్నారు. ఆక్రమణలపై త్వరలో నే సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ భూ ములపై త్వరలోనే విచారణ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. ఆక్రమణ భూముల లిస్టును తయారు చేస్తున్నట్లు చెప్పారు.

దేవాదాయ శాఖలో ఉద్యో గుల కొరత ఉందని చెప్పారు. ఖాళీలను గుర్తించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆల య భూములు ఉన్నాయని వాటిని సైతం గుర్తించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్చకులు ఎవరైనా దేవాలయ భూ ములు అమ్మినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు.

కొన్ని ఆలయాల్లో 42ఏ ళ్లుగా కుంభాభిషేకాలు నిర్వహించలేదన్నా రు. దశలవారీగా కుంభాభిషేకాలు నిర్వహిస్తామన్నారు. ఇటీవల కాళేశ్వరంలో కుంభాభిషేకం చేశామన్నారు. ఫారెస్ట్‌లో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదని మంత్రి చెప్పారు. అసంతృప్తి ఎమ్మెల్యేల విషయం తనకు తెలియ దని, తాను ఎవరినీ ఎంకరేజ్ చేయడంలేదని పేర్కొన్నారు. 

చెల్లెలిని చూసి నేర్చుకో కేటీఆర్..

కులగణన రీసర్వే చేస్తే తాను పాల్గొంటానని చెప్పిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి సురేఖ స్పందించారు. అడిగినప్పుడు వివరా లు ఎందుకు ఇవ్వలేదని, ఒకవేళ రీసర్వే కా వాలంటే.. కేటీఆర్ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు.

కులగణన సర్వేలో కేటీఆర్ చెల్లెలు కవిత పాల్గొన్నారని, ఆమెను చూసి కేటీఆర్ నేర్చుకోవాలని చెప్పారు. బీఆర్‌ఎస్ సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బీఆర్‌ఎస్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.