calender_icon.png 27 January, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చితికిన కూలీ బతుకులు

27-01-2025 12:48:39 AM

  1. అదుపుతప్పి ఆటోలపై పడ్డ ఐరన్‌లోడ్ లారీ
  2. అక్కడికక్కడే తొమ్మిది మంది మృతి
  3. ఆరుగురికి తీవ్ర గాయాలు
  4. వరంగల్ మామునూరులో ఘటన
  5. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

జనగామ, జనవరి 26 (విజయక్రాంతి): పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వలసొచ్చిన కూలీలను అనుకోని ప్రమాదం ఆ యువు తీసింది. భారీ ఇనుప లోడుతో ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి ఆటోలపై పడటంతో తొమ్మిది మంది కూలీలు మృత్యవాతపడ్డ హృదయవిదారక ఘటన ఆదివా రం వరంగల్ జిల్లా మామునూరు పరిధిలో జరిగింది.

రైల్వేపట్టాలు, ఐరన్ స్తంభాల లో డుతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీ ఖమ్మం వైపు మామునూరు మీదుగా వెళ్తోంది. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న రెండు ఆటోలపై పడింది. దీంతో ఆ రెండు ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఇనుప లోడును తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడ్డాయి.

ఘటనలో 9 మంది మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఎంజీఎంకు తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి ముందు లారీ డ్రైవర్ మంథని వద్ద కూడా ఓ ఆటోను ఢీకొట్టగా ఆటో డ్రైవర్‌కు తీవ్ర గా యాలైనట్లు తెలిసింది.

మృతులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి వలస వచ్చి వరంగల్‌లో ఉంటూ గొడ్డళ్లు, కత్తులు, వ్యవ సాయ పరికరాలు తయారుచేయడమే కాకుండా వివిధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఘటనా స్థలంలో వరంగల్ సీపీ అం బర్ కిశోర్ ఝా పరిశీలించారు.

తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌తో పాటు పోలీసు వాహనాల్లో ఎంజీఎంకు తరలించారు. ప్రమాదం నేప థ్యంలో వరంగల్ రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.

మామునూరు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.