calender_icon.png 18 January, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక నగరం కాంచీపురం

13-01-2025 12:00:00 AM

కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పురాతన దేవాలయాలు.. పట్టు వస్త్రాలు. అంతటి పురాతన చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పట్టణం కాంచీపురం. పట్టు వస్త్రాలకు, షాపింగ్ ప్రియులకు కాంచీపురం ప్రసిద్ధి చెందిన నగరం. కాంచీపురంలో దేవాలయాలకు వెయ్యి ఏళ్ల నాటి చరిత్ర ఉన్నది. ఈ నగరాన్ని దేవాలయాల నగరం అని కూడా అంటారు. తమిళనాడులోని కాంచీపురానికి వెళ్తే.. తప్పక చూడాల్సిన ప్రదేశాలివి.. 

కాంచీపురంలో కైలాష్ నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయాల్లో శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, గణేశుడు, కార్తికేయులను పూజిస్తారు. కాంచీపురం రత్నంగా పిలువబడే కైలాష్ నాథ్ ఆలయానికి 1,300 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇది అతి పురాతన దేవాలయం. ఈ నగరాన్ని సందర్శించడానికి వచ్చే భక్తులు, పర్యాటకులు ఆలయ నిర్మాణా శైలిని చూసి మంత్రముగ్దులవుతారు. 

అబ్బురపరిచే శిల్పశైలి..

కైలాష్‌నాథ్ ఆలయ నిర్మానం వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. ఈ ఆలయ ప్రత్యేకత ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని రాళ్ల ముక్కలను కలిపి నిర్మించారని భావిస్తున్నారు. ప్రధాన ఆలయ సముదాయంలో 58 చిన్న ఆలయాలను నిర్మించడం ఈ ఆలయానికి సంబంధించిన అతి పెద్ద విశేషం.

అంతేకాదు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గోడపై ఎనిమిది యాత్రా స్థలాలు ఉన్నాయి. ఇందులో రెండు ప్రవేశ ద్వారం ఎడమవైపున ఉండగా, ఆరు కుడి వైపున ఉన్నాయి. ఈ ఆలయ గర్భగుడిపై ద్రవిడ శిల్పకళలో ఒక విమానాన్ని నిర్మించారు. గర్భగుడిలో గ్రానైట్‌తో చేసిన అద్భుతమైన, భారీ శివలింగాన్ని ప్రతిష్టించారు. 

ఏకాంబరేశ్వరాలయం

ఏకాంబరేశ్వరాలయం 1400 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఇది పంచ భూత స్థలాలలో ఒకటి. ఈ ఆలయం కాంచీపురానికి ఉత్తరంగా ఉంటుంది. ఈ ఆలయం అతి పురాతనమైనది, పెద్దది కూడాను. ఏకాంబరేశ్వరాలయ గోపురం దేశంలోనే అన్ని దేవాలయ గోపురాల కంటే పొడవైనది. 

కంజీవరం సిల్క్..

కాంచీపురం ఆలయాలకు, శిల్పశైలికి మాత్రమే ప్రసిద్ధి కాదు. మన దేశంలోనే అతి ఉత్తమమైన సిల్క్ ఉత్పత్తి కూడా కలదు. సుమారు నాలుగు వందల చరిత్రకు నిదర్శనం కాంచీపురం పట్టు పరిశ్రమ. అద్భుతమైన నాణ్యత గల చీరలను, పట్టు వస్త్రాలను బంగారు, వెండి దారాలతో తయారు చేస్తారు.  కాంచీపురంలో చూడదగిన ప్రదేశాలు.. ఏకాంబరేశ్వరాలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం, కంచి కుడిల్ మ్యూజియం, వేదంతంగల్. 

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి రైలు, బస్సు సౌకర్యం కలదు.  అక్కడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.