calender_icon.png 22 December, 2024 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరిని బలిగొన్న అతి వేగం

15-10-2024 12:00:00 AM

చెట్టును ఢీకొన్న బైక్

యువకుల దుర్మరణం

హన్మాజిపేటలో ఘటన

సిరిసిల్ల, అక్టోబర్ 14: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలిగొన్నది. బైక్ చె ట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృ తిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వే ములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

హన్మాజిపేటకు చెందిన విక్కుర్తి దిలీ ప్(22), సురా అనిల్(21) ఆదివారం రాత్రి నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుక ల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనం త ర్వాత నూతనంగా కొన్న బైక్‌పై సరదాగా మామిడిపల్లి  గ్రామం వైపు వెళ్లారు. అతి వే గంతో వెళ్తుండటంతో బైక్ అదుపు తప్పి రో డ్డు పక్కనే  ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కుటుంబ స భ్యులు  108కు సమాచారం అందించినా స్పందించకపోవడంతో అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు తమ వాహనంలోనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించా రు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యంలోనే మృతి చెందారు.

హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఇద్దరు యువ కులు దసరా పండుగ కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి  చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.