calender_icon.png 23 November, 2024 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

23-11-2024 08:59:55 PM

18వేల 542 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం కొనుగోళ్ల సమీక్షా సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్పరెన్స్ హాల్లో కలెక్టర్, జిల్లా లో కొనుగోలు  కేంద్రాల ద్వారా చేపట్టిన  ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 45వేల 625 మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తే, తేమ శాతం, ఇతర నాణ్యత ప్రమాణాలు వచ్చిన 28వేల 847 మెట్రిక్ టన్నుల ధాన్యం  కొనుగోలు చేసి, 18 వేల 542 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశామని చెప్పారు.

కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీలో నమోదు చేసిన ధాన్యం వివరాలకు ఉన్న వ్యత్యాసాలకు గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యత  ప్రమాణాలను పరిశీలించి, తేమ శాతం రాగానే  కాంటా వేసి కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల సరఫరా చేసుకున్నప్పుడు నాణ్యతను పరిశీలించాలని సూచించారు. రానున్న మూడు వారాల్లో ధాన్యం ఎక్కువ పరిమాణంలో రానున్నట్లు కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం  కొనుగోలు  సకాలంలో  పూర్తి అయ్యే విధంగా చూడాలని  కలెక్టర్ ఆదేశించారు.  ఈ సమావేశంలో  అదనపు  కలెక్టర్  పి. శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో ఎస్.సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల సంస్ధ మేనేజర్ శ్రీలత, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.