calender_icon.png 19 April, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 01:26:06 AM

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, ఏప్రిల్ 8(విజయక్రాంతి)దివ్వాంగుల కోసం ప్రతినెల మొదటి శనివా రం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. అయితే ఈనెల 5వ తేదీన సెలవు కారణంగా మంగళవారం నాడు దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, డీఆర్డీవో పాల్గొన్నారు. మొత్తము 23 దరఖాస్తులు రాగా వాటిని త్వరితగతను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు.

సదరం సర్టిఫికెట్, రెన్యూవల్ కోసం సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సదరం క్యాం పులో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్లో సిటిజన్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు. నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ, డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రతినెలా మొదటి శనివారం నాడు దివ్యాంగుల ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది.