calender_icon.png 16 March, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ కు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి

16-03-2025 06:24:22 PM

కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం...

కాటారం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్గాలు డిమాండ్ చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, దొరల అహంకారాన్ని ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల రమేష్, మాజీ సర్పంచులు అజ్మీర రఘురాం నాయక్, అంగజాల అశోక్, వొన్న వంశవర్ధన్ రావు, కోడి రవి కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అమీర్ ఖాన్, నాయకులు ఓం సింగ్, చీమల రాజు, వెంకట్ రెడ్డి, ఆత్మకూరి కుమార్ యాదవ్, బీరెల్లి మహేష్, బాణోతు రాజ్ కుమార్, పసుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.