calender_icon.png 31 January, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ

11-12-2024 05:01:45 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేయడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లాలో, వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో CEIR పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టామన్నారు. గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 220 మంది బాధితులకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వారికి ఫోన్లను అప్పగించడం జరిగింది. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు.

కావున ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడినా, పోగొట్టుకున్నా వెంటనే CEIR పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్ లను పొందవచ్చునని తెలిపారు. పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్ వివరాలను పొందుపరిచి ఫిర్యాదు చేయగలిగితే అట్టి ఫోన్లను సులభంగా కనిపెట్టవచ్చని ఈ సందర్బంగా ఎస్పీ గారు తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను అవతల వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే అట్టి మొబైల్ ను ట్రేస్ చేయగలమని అన్నారు. ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసిఆర్బీ, డిఎస్పీ, మల్లయ్య, స్వామీ, ఐటి సెల్ ఇంచార్జి సీఐ నాగరాజు రెడ్డి, ఐటి సెల్ సభ్యులు విజయ్, రాజేష్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.