calender_icon.png 18 January, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్చిచ్చుకు మూలం?

16-01-2025 12:00:00 AM

నూతన సంవత్సర, క్రిస్మ స్ పర్వదిన వేడుకలను ఘనంగా జరు పుకొని సేద దీరుతు న్న వేళ ఈనెల 7న హఠాత్తుగా ప్రారంభమైన కార్చిచ్చు (వైల్డ్ ఫైర్) అణు విస్ఫోటనం వలె ఇంకా రగులుతూనే ఉండడం ఆశ్చర్యమేకాక ఆందోళననూ కలిగిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం నేటికి పాతికమంది వరకూ ఈ ఉపద్రవానికి బలైనారు. ఆస్తి నష్టం ఎంతో లెక్కలు తీయవలసి ఉంటుంది. లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అత్యంత సంపన్నుల అద్దాల మేడలు సహితం మంటల్లో కుప్ప కూలుతున్నాయి. ఊహింపశక్యం కాని వేగంగా విస్తరిస్తున్న భయం కర అగ్నివిధ్వంసాన్ని అదుపు చేయలేని నిస్సహాయ స్థితికి చేరిందంటే నమ్మశక్యం కావడం లేదు. అగ్రరాజ్యం అమెరికన్ యంత్రాంగమే విలవిలాడుతున్నందంటే ప్రకృతి ప్రకోపం ఎంత తీవ్రంగా ఉంటుందో మానవాళి అర్థం చేసుకోవాలి. కాలిఫోర్నియా ప్రాంతంలో కార్చిచ్చులు తరచుగా ఎగిసి పడడానికి ప్రాకృతిక ప్రకోపంతోపాటు మాన వ తప్పిదాలూ కారణమవుతున్నాయి.

ప్రతికూల వాతావరణ మార్పులతో సగటు ఉష్ణోగ్రతలు పెరగడం, భూఉ పరితలం పూర్తిగా ఎండలకు మండుతూ పొడి బారడం సహజమై పోయింది. 2023- ఏడాది అత్యంత వేడి వడగాలులను చవిచూసింది. ఈ పరిస్థితులే మహాగ్నికి ఆజ్యం పోశాయా? అక్కడి కార్చిచ్చు వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ, అగ్నిమాపక సిబ్బంది నివారణ ప్రయత్నాలకు సైతం లొంగడం లేదు.

ప్రతికూల వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న ఈ తరహా భారీ కార్చిచ్చులకు గంటకు 70 మైళ్ల వేగంతో వీచే వడగాలులు తోడవుతున్నాయి. దీని తీవ్రతకు అమెరికన్లు నిస్సహాయులవుతున్నారు. 2020 నమోదైన కార్చిచ్చుల ఫలితంగా ఇప్పటికే దాదాపు 7 లక్షల హెక్టార్ల ప్రాం తం కాలి బూడిద కాగా, బిలియన్ డాలర్ల ఆస్తినష్టం, ఎంతో ప్రాణనష్టం సంభవించింది. అయితే, దాదాపు 90 శాతం కార్చిచ్చులకు మానవ తప్పిదాలే కారణమనీ తేలింది.

అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున విడుదల చేస్తున్న విచక్షణారహిత కార్బన్ ఉద్గారాలు వాతావరణం లో భారీ ఎత్తున ఉష్ణోగ్రతల పెరుగుద లకు కారణమవడం బాధాకరం. ఇప్పటికైనా, ప్రపంచదేశాలన్నీ మేల్కొనాలి.

 డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి